నందమూరి నటసింహం బాలకృష్ణ కొడుకును గ్రాండ్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేద్దామన్న బాలయ్య ఆలోచనకు ఆదిలోనే బ్రేక్ పడింది. మోక్షజ్ఞ సినిమా కేవలం అనౌన్స్మెంట్ కి పరిమితమైంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా సినిమా వస్తుందా.. లేదా.. అనేది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మిగిలిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పటికీ అటు బాలకృష్ణ.. ఇటు ప్రొడక్షన్ సంస్థ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన అభిమానులలో సందేహాలు మాత్రం అలానే ఉండిపోయాయి.
ఇక ఈ గ్యాప్‌లోనే నందమూరి అభిమానుల నుంచి మోక్షజ్ఞ సినిమాపై కొత్త డిమాండ్స్ మొదలయ్యాయి. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా లాంచ్ చేయాలని నందమూరి ఫ్యాన్స్ బాలయ్యను కోరుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ నుంచి మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ అసలు ఆశించలేమని.. తాత్కాలికంగా అతన్ని పక్కనపెట్టి.. మరో స్టార్ డైరెక్టర్‌తో ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కించాలని మోక్షజ్ఞను పరిచయం చేయాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మొదలైన ఈ చర్చ వెనుక ఓ ఆసక్తికర విషయం కూడా వైరల్ గా మారుతుంది. ఇది ఫ్యాన్స్ నుంచి స్వయంగా పుట్టుకొచ్చిన డిమాండ్ కాదని.. నందమూరి కాంపౌండ్ కు చెందిన కొంతమంది వ్యక్తులు పీలర్లు వదిలిన తరువాత.. ట్విట్టర్‌లో ఈ చర్చ మొదలైందని హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తుంది. ఇక మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఏదో చిన్న చిన్న కారణాలతో సినిమా లేట్ అవుతుందనటానికి అవకాశమే లేదంటూ పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.