విశాల్‌తో హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ వెన‌క అస‌లు కార‌ణం ఇదా..?

కోలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్‌కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్‌లో రిలీజ్ అయిన విశాల్ సినిమాలు తెలుగులోనూ డజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోనూ విశాల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా వీశాల్ ఎప్పుడో న‌టించిన మదగజరాజా సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయ‌గా విశాల్‌ అందులో హాజరయ్యారు. ఎంతో స్ట్రాంగ్‌గా, హ్యాండ్సమ్ గా ఉండే విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. వీక్ గా నడవలేక, మాట సరిగ్గా రాక.. మైక్ పట్టుకుంటే చేతులు వణుకుతూ కనిపించడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Vishal Health: విశాల్‌కు ఏమైంది.. వివరంగా చెప్పిన ఖుష్బూ |  kushboo-gives-clarity-on-hero-vishal-health-condition

మా హీరోకి ఏం జరిగిందంటూ.. ఆందోళన మొదలైంది. అయితే విశాల్ కు హై ఫీవర్ కారణంగా అలా అయిపోయారని మాట కూడా బయటకు రాలేనంత వీక్ అయ్యారని.. ఇక మదగజరాజ సినిమా ఈవెంట్ కోసమే కష్టమైనా వచ్చాడంటూ టీం సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం విశాల్ కు సంబంధించిన ఎన్నో వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. విశాల్‌ ఎప్పుడూ డూప్ లేకుండానే స్టంట్స్‌ చేసేవారు. ఈ క్రమంలోనే షూటింగ్లో ఆయన తలకు దెబ్బ తగిలిందని.. దీంతో లోపల రెండు నరాలు డ్యామేజ్ అయ్యాయని.. ఆయనకు ఇప్ప‌టికి తీవ్రమైన తలనొప్పి వస్తుందని తెలుస్తోంది. ఈ ఇబ్బంది వల్లే అయినా పెళ్లి చేసుకోవడం లేదని మరో టాక్‌ వైరల్ గా మారింది. ఇప్పటికే రెండుసార్లు విశాల్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమాల్లో కీలక పాత్రలో నటించిన‌ ఓ హీరోయిన్‌తో విశాల్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ.. పెళ్లి సమయానికి అది క్యాన్సిల్ అయింది.

ANVShall Engaged Controversy king, Vishal gets engaged

పెళ్లిని విశాల స్వయంగా క్యాన్సిల్ చేశాడని త‌న కార‌ణంగా ఆమె ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే అల చేశాడ‌ని రూమర్లు కూడా వినిపించాయి. తనకు ఉన్న ఈ ప్రాబ్లం కారణంగానే పెళ్లి రద్దు చేసుకున్నాడని ఓ వార్త తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఈ వార్తల‌లో నిజం ఎంతో తెలియదు. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ దీనిపై రియాక్ట్ అయ్యారు. విశాల్‌కు ఎలాంటి ప్రాబ్లం లేదని.. డెంగ్యూ ఫీవర్ అది కూడా 104 ఫీవర్ రావడంతో ఆయన అలాయిపోయారు. వణుకుతూ మాట్లాడారు. సినిమా ఈవెంట్‌ మిస్ కాకూడదు అని ఉద్దేశంతోనే ఆయన అక్కడకు ఓపిక తెచ్చుకుని వచ్చారు. ఈవెంట్ అయిన వెంటనే హాస్పటల్ కి వెళ్ళిపోయారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే విశాల్ కు ఏదో రోగం ఉందంటూ వస్తున్న వార్తల్లో అసలు ఏమాత్రం నిజం లేదని.. ఏ విషయం పైన అయినా రూమర్ వస్తే.. అది వైరల్ గా మారిపోతూ మరిన్ని రూమర్లు క్రియేట్ అవ్వడం ఓ సీజన్‌లా మారిపోయింది అంటూ కామెంట్స్ చేసింది. ఇలాంటి వార్తలను పట్టించుకోవడం లేదంటూ కుష్బూ క్లారిటీ ఇచ్చింది.