డాకు మహారాజ్.. మేకర్స్‌ను టెన్షన్ పడుతున్న మ్యాటర్ అదేనా..

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12న సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డాకు మహారాజ్ విషయంలో మేక‌ర్స్‌లో ఆందోళన మొదలైందట‌. ఆ టెన్ష‌న్‌ వెనక అసలు కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న గేమ్ ఛేంజర్ కంటెంట్ ఓవర్సీస్‌కు ఈ రాత్రికి వెళ్లకపోతే అక్కడ ప్రేయర్లు సాధ్యం కావు. ఎలాగైనా కంటెంట్ ఈ రాత్రికి పంపించాలని నిర్మాత దిల్ రాజు మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్ కింద మీద పడిపోతున్నారు. అందువల్ల ఆల్మోస్ట్ గేమ్ ఛేంజర్ గట్టెక్కేసినట్లే.

NBK 109 : 'Daku Maharaj' First Lyrical Song.. Fans Ku Poonakale.! -  PakkaFilmy

ఇలాంటి క్రమంలో గేమ్ ఛేంజ‌ర్‌కు పనిచేసిన థ‌మ‌నే డాకు మహారాజ్‌కు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్ పనులు పూర్తయిన వెంటనే థ‌మన్.. డాకు మహారాజ్‌పై ఫోకస్ చేయాల్సి ఉంది. డాకుమహారాజ్‌కు సంబంధించి ఇంకా రెండు రీళ్ళకు థ‌మన్ మ్యూజిక్ ఇవ్వాల్సి ఉందట. ఆపైన మిక్సింగ్ చేయడం, అప్లోడ్ చేయడం, కాపీ చెక్ చేసుకోవడం తర్వాత కంటెంట్ మొత్తాన్ని ఓవర్సీస్‌కు పంపించడం.. ఇవన్నీ 9వ‌ తేదీలోగా డాకు మహారాజ్ విషయంలోనూ పూర్తయిపోవాలి.

ప్రస్తుతం థ‌మ‌న్ గేమ్ ఛేంజ‌ర్ కోసం పని చేస్తున్నారు. మరో పక్క డాకు కోసం డైరెక్టర్ బాబి కూడా నిద్ర లేకుండా ల్యాబ్ లోనే గడుపుతున్నారు. ఇలాంటి క్రమంలో గడబిడ లేకుండా వాటిని పూర్తి చేయాలి. క్వాలిటీ మాత్రం దెబ్బ తినకూడదు. ముఖ్యంగా ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డిజైన్ చేయాల్సి ఉంది. ఇవన్నీ పర్ఫెక్ట్ గా జరగడానికి కేవలం ఆయన ముందు ఉన్న సమయం 48 గంటలు మాత్రమే.. రేపటి నుంచి ఆయన పూర్తిగా ఫోకస్ చేసి నాకు మహారాజ్ పనులను పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తాడా లేదా అనే విషయంలో మేకర్స్ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. అయితే బాలయ్య గ‌త‌ సినిమాలన్నీటికి థ‌మ‌న్ మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే డాకుమహారాజ్ విషయంలో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని థ‌మ‌న్ నిలబెట్టుకుంటాడో లేదో వేచి చూడాలి.