సెట్స్ లో అందరి ముందు స్టార్ కమెడియన్ పై చెయ్యి చేసుకున్న వెంకటేష్.. కారణం ఇదే..

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి బరిలో సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు వెంకీ మామ. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్‌ నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ ఈటీవీలో నిర్వహించిన అల్లుడా మజాకా షోలో సందడి చేశాడు.

ఇక ఈ ఎపిసోడ్‌లో సీనియర్ హీరోయిన్ మీనా, కుష్బూ కూడా పాల్గొని వెంకటేష్ తో కలిసి మెరిసారు. ఎప్పటిలాగే కమెడియన్స్ అందరు కూడా తమదైన సైలిలో తమ కామెడీ పంచ్‌లతో ఆకట్టుకున్నారు. కాగా వెంకటేష్ స‌డ‌న్గా ఒక కమెడియన్ పై చేయి చేసుకోవడం అందరికీ షాక్‌ను గురి చేసింది. వెంకటేష్ ఘర్షణ మూవీలో ఏసీబీ రామచంద్ర గెటప్ వేశాడు. లోకల్ గ్యాంగ్స్టర్ రోల్ లో నటించిన సునామీ సుధాకర్ చంపను చెల్లుమనిపించాడు.

సుధాకర్ రింగ రింగ రింగ రింగా సాంగ్ పాడుతుంటే ఏంట్రా అది అంటూ వెంకటేష్ సీరియస్ గా అడిగాడు.. పాట అని సుధాకర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా సుధాకర్ చంపపై వెంకటేష్ కొట్టాడు. పొట్టి న‌రేష్‌తో కూడా తనదైన స్టైల్ లో కామెడీ పండించాడు వెంకీ మామ. అయితే ఇదంతా స్క్రిప్ట్ లో భాగమే అని క్లియర్ కట్గా తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు వెంకటేష్ హాజరుకాడు. కానీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదటిసారి బుల్లితెర షోలో వెంకటేష్ సంద‌డి చేయడంతో అభిమానులు అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.