హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ఈ రహస్య విషయాలు మీకు తెలుసా..!

ప్రస్తుతం సంక్రాంతి బరిలో రిలీజ్ అయినటువంటి మూవీ ” హనుమాన్ “. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ లో అమృత అయ్యర్ కథానాయకగా నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. చెన్నైలో పుట్టిన బెంగళూరులో పెరిగింది.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక అనంతరం షార్ట్ ఫిలిమ్స్ చేసి ఎంతోమంది ప్రేక్షకులని అలరించింది. తొలుత మలయాళం లో 2012లో వచ్చిన ” పద్మవ్యూహం ” సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇక అనంతరం విజయ్ దళపతి నటించిన ” బిగిల్ ” సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక అనంతరం ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజులలో ప్రేమించడం ఎలా.. అనే సినిమాలో హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తేజ సజ్జ హనుమాన్ సినిమాలో కథానాయకగా నటించింది. ఇక ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈమె కెరీర్ పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుద్దో చూద్దాం.