మహేష్ న్యూ లుక్ వైరల్.. గౌత‌మ్‌కు తమ్ముడిలా ఉన్నావ్ అన్నా అంటూ..

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్ది మరింత యంగ్‌గా క‌నిపిస్త‌న్నాడు. ఐదు పదుల వయసు దగ్గరలో ఉన్నా ఏమాత్రం అలా అనిపించరు. మరో రెండు ఏళ్లలో హాఫ్ సెంచరీ దాటపోతున్న మహేష్ ఇప్పటికీ యంగ్ లుక్ లో కనిపిస్తాడు. అంతగా టీనేజర్ల మెరిసిపోతున్నాడు. తాజాగా మహేష్ ఇస్మార్ట్ లుక్ లో కనిపించిన ఫోటో ఇన్స్టా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోగ్రఫీలో మహేష్ కాలేజ్ బాయ్‌లా అందరిని ఆకట్టుకున్నాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిన మహేష్ అందరి మైండ్ ను బ్లాక్ చేసేస్తున్నాడు. ఇక ఈ ఫోటో వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ అంతా మీ కొడుకు గౌతమ్‌కు తమ్ముడి లాగా ఉన్నారన్నా.. మరి టూమచ్ యంగ్‌గా కనిపిస్తున్నారన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఇంత షార్ప్ లుక్ లో మెరవడానికి కారణం తన నెక్స్ట్ మూవీ కోసమే అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్లో పాన్ వ‌ర‌ల్డ్ గా తెర‌కెక్కుతున్న సినిమా కోసమే తన మేకోవర్‌.. స్టైలిష్ లుక్ లో మార్చుకున్నాడు అని తెలుస్తుంది. ఇక సినిమా లుక్ కోసం చాలా కాలం నుంచి జిమ్, యోగ అంటూ బాగా శ్రమిస్తున్న మహేష్.. ఫుడ్ డైట్ ను కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ చివరకు తన అల్ట్రా స్టైలిష్ లుక్ ను సాధించాడు. ఇక తాజాగా మహేష్ నటించిన మూవీ గుంటూరు కారం. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్. జై రాయి కీలకపాత్రలో మెప్పించారు.

ఈ సినిమాకు థ‌మ‌న్‌ సంగీతం అందించాడు. రిలీజ్ కి ముందు వరకు మంచి బ‌జ్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి మంచి విజయాన్ని అందుకుంది. సినిమా రిలీజై మొదటి షో పూర్తైన తర్వాత మాత్రం మిక్స్డ్ టాక్‌ సొంతం చేసుకుంది. అయినప్పటికీ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ అంతా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ అవుతుందంటూ వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి బరిలో గుంటూరు కారం తో పాటు తేజ సజ్జా.. హనుమాన్, వెంకటేష్.. సైంధవ్, నాగార్జున.. నా సామిరంగా సినిమాలో కూడా సందడి చేయబోతున్నాయి.