ధియేటర్స్ లో హనుమాన్ చూసే వాళ్లకి..బాహుబలి లెవల్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..!

హనుమాన్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. తేజ సజ్జ నటించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు చాలామంది తెరపై రాముడుని హనుమంతుడిని తమదైన స్టైల్ లో చూపించాడు. కానీ ప్రశాంత్ వర్మ చూపించిన తీరు మాత్రం అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది .

మరి ముఖ్యంగా తేజ ఈ సినిమాలో ప్రాణం పెట్టినటించాడనే చెప్పాలి . ఈ సినిమా ఫుల్ టు ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పక తప్పదు . కాగా బాహుబలి లో ఎలా అయితే రాజమౌళి కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనే రేంజ్ లో ట్విస్ట్ పెట్టారో.. అదేవిధంగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటి అని ట్విస్ట్ పెట్టారు . అంతేకాదు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతుంది అంటూ ముందు ప్రకటించాడు ప్రశాంత్ వర్మ .

కాగా హనుమాన్ సినిమా చివరిలో జై హనుమాన్ అంటూ హనుమాన్ సినిమాకి సీక్వెల్ ని కూడా ఖరారు చేశారు . ఈ చిత్రాన్ని 2025 లో తీసుకురాబోతున్నట్లు కూడా పేర్కొన్నారు . ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం కావడంతో సెకండ్ పార్ట్ పై అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు . మొత్తానికి తేజా సజ్జ సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి. చూద్దాం మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో..??