రాజమౌళి చేస్తున్నారని ఆ కథను వదిలేసా.. ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్..

హనుమాన్ తో మొట్టమొదటిసారి తెలుగులో ఒక సూపర్ హీరో కథను తెర‌కెకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఈరోజు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రశాంత్ వర్మ ఒక ఫిలిం మేకర్ గా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం పైనే నా ధ్యాసంతా ఉంటుందని.. సినిమా రిలీజ్, థియేటర్ల కేటాయింపుల‌ని నిర్మాతలే చూసుకుంటారని.. ఈ సినిమా సక్సెస్ అయితే రాబోయే కాలంలో తెలుగు ప్రేక్షకులకు గర్వపడే సినిమాలను చేసేలా మేము కొన్ని ప్లాన్ చేసుకున్నామంటూ వివరించాడు. కానీ ఇప్పుడు ఇదంతా జరుగుతుంది అంటూ పరోక్షంగా థియేటర్ల వివాదంపై స్పందించాడు.

తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడకపోవడం ఇంకా పెద్ద తప్పు అని ఓ సామెత ఉంది. అందుకే కొన్ని విషయాలపై నేను స్పందిస్తున్న అంటూ ప్రశాంత్ వర్మ మాట్లాడారు. ఇక‌ హనుమాన్ కు కె నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నిన్న ప్రశాంత్ వర్మ విలేకరుల సమావేశంలో కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. సినిమా కోసం తేజ కొత్త మేకోవర్ అయ్యాడు. యాక్టింగ్ గురించి అతనికి నేనేం నేర్పాల్సిన పనిలేదు. పైగా సెట్స్ లో ఈ సన్నివేశంలో ఇలా కాదు ఇలా చేయని నాకు నటించి చూపించడం కూడా రాదు.

అన్నిటికీ తేజ రెడీ టు డూ అన్నట్లుగా ఉండేవాడు. హనుమాన్ పై నాకంటే ఎక్కువ ఆశలు తేజానే పెట్టుకున్నట్లు ఉన్నాడు.. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.. టైం కేటాయించాడు.. కొత్త సినిమాలకు కూడా సైన్ చేయలేదు. తాజాగానే ఓ సినిమాను ఒప్పుకున్నాడంటూ వివరించాడు. సినిమా మొదలైన 20 నిమిషాలు హీరో క్యారెక్టర్ సింపుల్గా ఉన్నా హీరో పాత్రకు సూపర్ పవర్స్ వచ్చిన దగ్గర నుంచి స్టోరీ ఎంతో ఆసక్తిగా సాగుతుందని వివరించాడు. ఇక తెలుగు సినిమా స్టైల్ పోలి ఉండే ఒక సూపర్ హీరోనే హనుమాన్. బ్యాట్‌మ్యాన్ సినిమా రాజమౌళి గారు తీస్తే ఎలా ఉంటుందో హనుమాన్ ఆలా ఉంటుంది.

కేజిఎఫ్ లో య‌ష్‌ను ఎలివేట్ చేసినట్లుగా హనుమాన్ ను సినిమాలో ఎలివేట్ చేసాం. నిర్మాత నిరంజన్ రెడ్డి గారు నాకంటే పాజిటివ్.. మేము ఏది చెప్పినా దాన్ని ఎక్సటెన్షన్ లెవెల్ లో ఆయన ఆలోచించేవారు. ఇక దాసరధి శివేంధ్ర‌ గారు చాలా మంచి విజువల్స్ ను అందించారు. మేము అనుకున్న దానికన్నా బడ్జెట్ మూడింతలు పెరిగింది. అయితే క్వాలిటీ దానికన్నా పదింతలు పెరిగింది. ఇక ఈ సినిమాను త్రీడీలో చేయాలంటే మరింత బడ్జెట్ అవుతుందని త్రీడీలో రిలీజ్ చేయలేదు.

అయితే రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ వస్తే భవిష్యత్తులో రీ రిలీజ్‌ త్రీడీలో ఉంటుంది అంటూ వివరించాడు. ఇక నెల గ్యాప్ తో విదేశీ భాషలను హ‌నుమాన్‌ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా అన్న ప్రశాంత్ వర్మ.. పురాణాలపై, ఇతిహాసాలపై సినిమాలు చేయాలని ఆసక్తి ఉంది. మహాభారతంపై సినిమా చేయాలనుకున్న కానీ రాజమౌళి గారు ఆ కథను చేయాలనుకుంటున్నారని తెలిసి డ్రాప్ అయ్యాను అంటూ వివరించాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.