సంయుక్త మీనన్ కు సినిమా అవకాశాలు తగ్గడానికి వెనుక ఉన్న కారణం ఇదేనా..!

హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ” బిమ్లా నాయక్ ” సినిమాలో రానాకి వైఫ్ గా నటించి టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక అనంతరం సాయి ధరమ్ తేజ్ తో ” విరూపాక్ష ” ధనుష్ తో ” సార్ ” వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది.

అంతేకాకుండా ఈ సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇలా కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం మాత్రం పెద్దగా ఈమెకి అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే ఈమెకి ఎందుకు సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు అనే దానిపై ప్రేక్షకులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈమెకి పెద్దగా అవకాశాలు రాకపోవడానికి కారణం ఈ ముద్దుగుమ్మ పెద్దగా గ్లామర్ షోస్స్‌ చేయకపోవడమే అన్నట్లు తెలుస్తుంది.

కొందరు హీరోయిన్లకి వారు నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ వారికి మంచి క్రేజ్ వస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మకి మాత్రం ఈమె నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక ఈమె సోషల్ మీడియా లో కాస్త అందాల దోస్‌ పెంచితే కానీ ఈమెకి అవకాశాలు రావని చెప్పొచ్చు. మరి ఇది అర్థం చేసుకుని ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందాలను చూపిస్తుందో లేదా సినిమా ఇండస్ట్రీని ఇక మర్చిపోతుందో చూడాలి మరి.