సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న సితార పోస్ట్… ఆ క్షణంలో చాలా హ్యాపీగా ఉన్నానంటూ కామెంట్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ చిన్నారి 12 ఏళ్ల వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఓ పోస్ట్ పెడితే క్షణంలో వందల లైక్‌లు, లక్షల యూస్ వస్తాయి. ఇక సితార ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ బ్రాంచ్ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫాన్స్ తో పంచుకుంటుంది. అయితే సితార తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో 400 కె ఫాలోవర్స్ అవ్వడంతో ఈ సందర్భంగా..” నాకు ఇన్స్టా లో 400 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా సోషల్ మీడియా ఫ్యామిలీ వేరీ స్ట్రాంగ్ ఉంది.

అందరికీ థాంక్యు సో మచ్. లవ్ యు ఆల్ ” అంటూ ఓ ఫోటోని షేర్ చేసి రాసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మహేష్ అభిమానులు ..” నువ్వు కూడా మీ డాడీ అంతా పెద్ద యాక్ట్రెస్ అవుతావు. నువ్వు మహేష్ గారి కూతురుగా పుట్టడం నీ అదృష్టం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.