హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేసిన ఆ స్టార్ హీరో.. పోస్ట్ వైరల్..!

పాన్ ఇండియా హీరో తారక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాపై తారక్‌ అభిమానితో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గానే క్రేజీ గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ గ్లింప్స్ పై బాలీవుడ్ గ్రీక్ గాడ్ ఎన్టీఆర్ కో స్టార్ హృతిక్ రోషన్ స్పందించాడు.

రీసెంట్ గానే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ భర్తడే సందర్భంగా విషెస్ చెప్పగా దానికి రిప్లై ఇస్తూ రితిక్ ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే తనకి దేవర గ్లింప్స్ చాలా బాగా నచ్చాయంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన తారక్ అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు.