“నయనతార ఓ మూర్ఖురాలు”.. ఇలాంటి పనులు కూడా చేస్తుందా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ ని ఏ విధంగా హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి చేస్తున్నారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ ని అదే పనిగా టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. రీసెంట్గా హీరోయిన్ నయనతార అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది. రీసెంట్ గా నయనతార ఓ గుడికి వెళ్ళింది . ఆమెకు అక్కడ సిబ్బంది నిమ్మకాయి చేతికి ఇస్తారు . అయితే ఎంతో పవిత్రంగా భావించిన నయనతార నిమ్మకాయను దండం పెట్టుకొని మరి జాగ్రత్తగా దాచుకుంటుంది .

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కొందరు మాత్రం నయనతార చదువుకున్న మూర్ఖురాలు అని.. అంత పెద్ద హీరోయిన్ అయ్యి ఇలాంటివి నమ్ముతుందా ..?? అంటుంటే మరికొందరు అది ఆమె ఇష్టం ..ఆమె నమ్మకం మీకు ఏం రైట్ ఉందని ఆమెను ట్రోల్ చేస్తున్నారు అంటూ వ్యంగ్యంగా ఆమెను ట్రోల్ చేసే వాళ్లపై కౌంటర్స్ వేస్తున్నారు . కొందరు అది మంత్రించిన నిమ్మకాయ జాగ్రత్తగా పెట్టుకుని వెళ్లూ అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే నయన్ ఆ నిమ్మకాయను దాచుకోవడం వెనుక ఏ రీజన్ ఉందో తెలియదు కానీ..ఆమెను అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది చాలా చిన్న విషయం కానీ ఆమెను ఓ రేంజ్ లో ఆడేఅసుకుంటున్నారు ఆకతాయిలు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు..సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలను ఎంత చులకనగా చూస్తారో అనేది..!!