ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈన సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల గురించి జ్యోతిష్కం చెబుతూ ఎప్పటికప్పుడు వార్తల‌లో నిలుస్తుంటాడు. అంతేకాకుండా సినీ సెలబ్రిటీల గురించి చెబుతూ పెద్ద సెన్సేషన్‌నే సృష్టిస్తాడు. నాగచైతన్య, సమంత పెళ్లినాడే వీరిద్దరూ వేడాకులు తీసుకుంటారు అని చెప్పి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వేణు స్వామి. ఇక ఈయన చెప్పినట్లుగానే వారిద్దరూ వేడాకులు తీసుకున్నారు.

ఇక తాజాగా వేణు స్వామి మరో జంటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. గతంలో నయనతార పెళ్లి సమయంలో.. వేణు స్వామి ఆమెకు పెళ్లి సెట్ కాదని చెప్పారు. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెల్లడించారు. ఒకానొక సందర్భంలో విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలియజేశారు. అయితే అప్పుడు వేణు స్వామి మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు.

పైగా శుభమని పెళ్లి చేసుకుంటే విడాకులు, ఇబ్బందులు అంటున్నారేంటని ఫైర్ అయ్యారు కూడా. ఇక తాజా పరిణామాలు బట్టి వేణు స్వామి చెప్పిన మాటలు నిజమవుతాయేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం.. పెళ్లయిన కొన్ని రోజులకే తిరుమల ఇష్యూ నడిచింది. ఆ తరువాత పిల్లల కారణంగా కోర్టులో విచారణ, ఇప్పుడు ” అన్నపూరణి ” సినిమాపై కేసు ఇలా అనేక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని పరిగణంలోకి తీసుకుని చూస్తే వేణు స్వామి చెప్పిందే నిజమా అయ్యేలా అనిపిస్తుంది.