పన్ ఇండియా స్టార్ బ్యూటీ రష్మికకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్పా సినిమాతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారి ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్‌కు జంటగా రష్మిక నటించిన మూవీ యానిమల్ ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.
ఈ సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రష్మికకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చాలామంది సినీ సెలెబ్రిటీస్, పొలిటికల్ సెలబ్రిటీస్ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు. అలా చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రష్మికకు సంబంధించిన మరో వీడియో కొందరు వైరల్ చేయగా వీటన్నిటి గురించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ డీప్ ఫేక్ వీడియో పై స్పందించింది.
ఇక ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రీన్ కలర్ టీషర్ట్ ధరించి బెడ్ పై రిలాక్స్ అవుతున్న ఫోటోలు షేర్ చేసుకుంది. అంతేకాకుండా రికవరీ చాలా ముఖ్యం అంటూ దానికి ట్యాగ్ చేసింది. దీనితో అది చూసిన నెట్టిజన్లు నేషనల్ క్రష్‌కు ఏమైంది అనే టెన్షన్లో పడ్డారు. ఏమైంది రష్మిక అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రష్మిక వైరల్ ఫీవర్ తో గత కొద్ది రోజులుగా బాధపడుతుందట. దీంతో ఆమె షూటింగ్లకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటుందని సమాచారం.