” సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ కు అలాంటి ఫోటోలను పంపించాను “… నాగార్జున మరదలు పిల్ల సెన్సేషనల్ కామెంట్స్…!!’

ఒకప్పుడు సౌత్ సినిమాలలో సత్తా చాటిన బ్యూటీ కస్తూరి శంకర్. కమల్ హాసన్ తో , భారతీయుడు.. అక్కినేని నాగార్జునతో,అన్నమయ్య సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ బ్యూటీ. ఇక తాజాగా ” గృహలక్ష్మి ” అనే సీరియల్తో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఓ వెలుగు వెలిగింది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. వివాదాస్పద అంశాలపై స్పందిస్తూ ఒక్కోసారి చిక్కుల్లో పడుతుంది. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా తనదైన శైలిలో విమర్శలను అడ్డుకుంటూ.. కౌంటర్స్ ఇస్తుంది.

ఇది ఇలా ఉంటే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి.. తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. కస్తూరి మాట్లాడుతూ…” భారతీయుడు సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట నన్ను సంప్రదించారు. సెలక్షన్లు జరుగుతున్న సమయంలో ఎలాగైనా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవాలని డైరెక్టర్కు బికినీ ఫోటోలు కూడా పంపించాను.

అయితే అదే సమయంలో ” రంగీలా ” మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఊర్మిళ గురించి అంతా మాట్లాడుతున్నారు. దీంతో అటెన్షన్ మొత్తం ఆమెపైకి వెళ్లిపోవడంతో… చివరకు ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. భారతీయుడికి కుమార్తెగా, కమల్ హాసన్ కు చెల్లి పాత్రను నాకు ఇచ్చారు. ఏంటి సార్ ఇలా చేశారు అని ప్రశ్నిస్తే.. సినిమాలో మెయిన్ రోల్ ఇదే అని చెప్పడంతో ఒప్పుకున్న ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.