సింగిల్ రుపీ కూడా తీసుకోకుండా .. పవన్ కళ్యాణ్ చేసిన ఏకైక సినిమా ఇదే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎన్నెన్నో సినిమాల్లో నటించారు . కొన్ని హిట్ అయ్యాయి.. కొన్ని ఫ్లాప్స్  పడ్డాయి . అయినా కానీ ఎప్పుడూ కూడా క్రేజ్ తగ్గకుండా అదే రేంజ్ మైంటైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ప్రజెంట్ రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చేస్తూ అభిమానులకి కొత్త ఫీలింగ్ ను కలగజేస్తున్నారు .

కాగా ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ .. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి.  పవన్ కళ్యాణ్ తన సినిమాలో రెమ్యూనరేషన్ విషయంలో ఏనాడు డైరెక్టర్స్ ను మేకర్స్ ను ఇబ్బంది పెట్టడట . వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడట . అంతేకాదు పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన అన్న చిరంజీవి సినిమాలో నటించాడు .

ఆ సినిమా మరేదో కాదు శంకర్ దాదా జిందాబాద్.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు నిమిషాల సీన్ లో కనిపిస్తాడు . ఈ సీన్ అప్పట్లో హైలైట్ గా మారింది.  అయితే వేరే ఏ హీరో ఈ పాత్ర చేస్తున్న కచ్చితంగా డబ్బులు తీసుకునేవారు.  పవన్ కళ్యాణ్ అన్న.. మీద ఉన్న గౌరవంతో ఈ సినిమాకి అసలు రెమ్యూనరేషన్ నే తీసుకోలేదు..!!