ఆ ఊరి జనం హనుమంతుడి పేరు వింటేనే కోపంతో ఊగిపోతారు.. కారణం ఏంటంటే..

మనదేశంలో కోట్లాదిమంది ఆంజనేయుని భక్తులు ఉన్నారు. దాదాపు ప్రతి ఊరిలోను హనుమంతుడిని దైవంగా కొలుస్తారు. మనసులో ఏమాత్రం భయం ఉన్న‌ జై భజరంగబలి అంటూ త‌లుస్తారు. కానీ మనదేశంలోనే ఓ గ్రామంలో మాత్రం హనుమంతుడి పేరు చెబితేనే కోపంతో ఊగిపోతారు. హనుమంతుడిని అసలు ప్రార్ధించ‌రు. అసలు హనుమంతుడి గుడి కూడా కట్టరు. అదే ద్రోణగిరి. ఉత్తరాఖండ్ లోనే ఈ గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంతకీ దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.

ఆంజనేయ స్వామి గుడి లేని ద్రోణగిరికి.. రామాయణానికి కనెక్షన్ ఉంది. లక్ష్మణుని ప్రాణాలను రక్షించేందుకు హనుమంతుడు సంజీవని కోసం పర్వతాన్ని చీల్చుకుని వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ టైంలో పర్వతాన్ని నేలకూల్చాడు. ఆ గ్రామస్తుల కోపానికి కూడా కారణమే ద్రోణగిరిని కూల్చ‌డం. ఆ పర్వతం తమ దైవం అని గ్రామస్తులు నమ్ముతారు.

పర్వత దేవత నుంచి అనుమతి తీసుకోకుండా ఆయన ధ్యానం భంగం చేసి పర్వత దేవుని కుడి భుజాన్ని పెకిలించాడు హనుమంతుడు. ద్రోణగిరిలో ఈరోజుకు కూడా ఆ పర్వత దేవుని కుడిచేయి నుంచి రక్తం కారుతోందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే హనుమంతుడి పై వారు ఎప్పుడు కోపంతో ఉంటారు. ఆ పర్వతం ఈరోజు పూర్తిగా ఇక్కడే ఉండి ఉంటే తమ గ్రామం మరింత సుభిక్షంగా ఉండేదని వారి నమ్మకం. ఈ కారణంగానే హనుమంతుడిని ఆ గ్రామ ప్రజలు ఎప్పుడూ దైవంగా కొలవరు.