చెల్లెలి కోసం అలాంటి త్యాగం చేయబోతున్న వరుణ్.. భర్తకు సపోర్ట్ చేస్తున్న లావణ్య..

ఇటీవల ఇటలీలో వరుణ్ – లావణ్య ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో వరుణ్ – లావణ్య వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. నవంబర్ 1న వివాహం గ్రాండ్గా జరిగింది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే మెగా కోడలు లావణ్య పెళ్లయిన తర్వాత మొదటి పండుగ దీపావళిని అత్తారింట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలో లావణ్య.. మరదలునిహారిక‌ కోసం ఓ త్యాగం చేయడానికి రెడీ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయానికి వెళ్తే ఓ స్టార్‌ డైరెక్టర్ లావణ్య త్రిపాఠి దగ్గరకు వచ్చి ఓ స్టోరీ వినిపించాడట. కానీ దానికి లావణ్య ఈ క్యారెక్టర్‌కు నిహారిక అయితే బాగా సూట్ అవుతుంది. తనని తీసుకోమని సలహా ఇచ్చిందట. అయితే ఆ డైరెక్టర్ మాత్రం లావణ్య త్రిపాఠాకి.. నిహారిక వద్దని చెప్పేసాడట. మీరైతే కరెక్ట్ బాగా సెట్ అవుతారని మేము అనుకుంటున్నాం మీరు ఈ సినిమా చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడట. అయితే గతంలో జొన్నలగడ్డ చైతన్యకు డివోర్స్ ఇచ్చిన నిహారిక పలు ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించినా లాభం లేకపోవడంతో.. నిహారికా నిర్మాతగా మారి వెబ్ సిరీస్ రూపొందిస్తుంది. ఇటీవల ఓ పెద్ద సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించడానికి ముందుకొచ్చింది. అయితే త్వరలో వరుణ్ – లావణ్య కాంబినేషన్లో కూడా మరో సినిమా చేయబోతుందని తెలుస్తుంది. దీనికి ఈ కొత్తజంట కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. అలాగే నిహారిక‌కు పెళ్లి చేశాకే పిల్లలను కనాలని వరుణ్… లావణ్యను అడిగినట్లు లావణ్య కూడా దానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చెల్లెలు కోసం వరుణ్ తేజ్.. మరదలు కోసం లావణ్య ఇలాంటి త్యాగం చేయడంతో ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.