ఆ రోజులు ఇప్పటికీ మర్చిపోలేనంటూ బాగోద్వేగానికి గురైన విద్యాబాలన్..!!

ఒకప్పటి ఇండస్ట్రీ వేరు ఇప్పటి ఇండస్ట్రీ వేరు ఈమధ్య ఎలాంటి విషయాన్ని అయినా సరే చాలు సోషల్ మీడియా మన ముందు వాలుతోంది.. ఒకప్పుడు సోషల్ మీడియా ఉండేది కానీ ఇంతగా వైరల్ కాకపోయేవి అంటూ ఒక మాజీ స్టార్ హీరోయిన్ మాట్లాడారు. ఆమె ఎవరో కాదు హీరోయిన్ విద్యాబాలన్.. ఇమే మాట్లాడుతూ ‘అప్పట్లో సోషల్‌ మీడియా లేకపోతేనేం ఉన్న మీడియాతో వేగలేకపోయాం అంటూ తెలియజేస్తోంది.

కెరీర్ పరంగా తనకు ఎదురైన అటువంటి కొన్ని చేదు జ్ఞాపకాలని గుర్తుకు చేసుకున్నారు నటి విద్యాబాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని విషయాలను వెల్లడించింది.గతంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాను ఎంతో బాధపడ్డానని చెప్పిన ఆమె… ఆ అవమాన భారం, భయంతో ఇంట్లో నుండి బయటకు రావాలనిపించలేదని చెప్పారు. నాకు నేనే నచ్చేదాన్ని కాదు..బయటకు రావాలంటే భయమేసేది.. ఎలాంటి బట్టలు వేసుకోవాలన్న ..నేను ఎలా కనిపిస్తానో అంటూ చాలా భయపడేదాన్ని తెలిపింది.

ఇండస్ట్రీ మొదట్లో అడుగు పెట్టినప్పుడు మంచి ఆదరణ పొందాను ..నటించిన రెండు కమర్షియల్‌ సినిమాలు విడుదలయ్యాక తనను ఎంతగానో ఇష్టపడిన వారే విమర్శించడం మొదలుపెట్టారని బాధపడుతూ చెప్పింది విద్యా బాలన్‌. ఆ పాత్రలకు సరిగ్గా మెప్పించ లేకపోవడంతో పాటు భారీ బరువు ఉన్నావని చెప్పారు. అలాగే తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా నచ్చలేదని వరస్ట్ డ్రెస్సింగ్ అవార్డుకు తనను ఎంపిక చేశారట.దీంతో విద్యాబాలన్ చాలా బాధపడిందట.

ఈ భయం వల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలనిపించటమే లేదని.. అలాగే నా అదృష్టవశాత్తు అప్పట్లో సోషల్ మీడియా లేదు లేకుంటే నేను బయటకు రావటానికి ఇంకాస్త టైమ్ పట్టేదని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.అప్పట్లో మంచి పాపులారిటీని ఇమేజ్ ని సంపాదించుకున్న విద్యాబాలన్ ఇప్పుడు సినిమాలకి దూరమైపోయింది.