టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అప్పటినుంచి ఇప్పటివరకు వెంకటేష్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక వెంకటేష్ కీలక పాత్ర వహిస్తున్న మూవీ ” సైంధవ్ “.
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇటీవల వచ్చిన రానా నాయుడు లో ఈయన ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ఇది ఇలా ఉండగా ఈ దీపావళికి చిరంజీవి, రామ్ చరణ్ మెగా ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందులోని ఓ ఫోటోలో వెంకటేష్ ఆండ్రాయిడ్ ఫోన్ పగిలిపోయింది. ఈ ఫోన్ నిజంగానే పగిలిందా? లేదా స్క్రీన్ గార్డ్ పై గీతలు పడ్డాయో తెలియదు. అయితే ఈ రెండిటిలో ఏది జరిగిన చాలామంది సెలబ్రిటీలు కొత్త ఫోన్ కొంటారు. కానీ వెంకటేష్ ఈ ఫోన్ తో ఓ పెద్ద పార్టీకే వెళ్లారు. దీంతో అది చూసిన ప్రేక్షకులు వెంకటేష్ సింప్లిసిటీకి ఫిదా అయిపోయారు. అలాగే ” వెంకీ మామ నువ్వు చాలా గ్రేట్ ” అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు.