పిల్లలలో టైప్ 1 డయాబెటిస్.. ఈ చిట్కాలను పాటిస్తే చెక్ పెట్టవచ్చు..

ఈ రోజుల్లో మధుమేహం అనేది చిన్న ,పెద్ద అని తేడా లేకుండా అందరికీ వస్తుంది. టైప్-1, టైప్-2 ఇలా రెండు విధాలుగా మధుమేహం వస్తుంది. ఒకసారి మధుమేహం వచ్చిందంటే చాలు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకోలేము. ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజు వాకింగ్, ఆహార నియమాలు, కొన్ని పండ్లు, తీపి ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చన్న విషయం తెలిసిందే.

ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన శరీరంలో షుగర్ లెవెల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. టైప్ 1 మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి.. దీనిలో రోగ నిరోధిక వ్యవస్థ ప్యాంక్రియాస్ లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది. ఫలితంగా, శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతోంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టైప్ 1 మధుమేహం బాల్యం, కౌమారదశలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, జన్యుపరమైన అంశాలు, ఒక వ్యక్తి జీవనశైలి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు. అందుకే మీ పిల్లలను టైప్ 1 డయాబెటిస్ నుంచి రక్షించుకోవడానికి ఈ కింద ఉన్న చిట్కాలను అనుసరించండి.

• బ్లడ్ షుగర్ మానిటరింగ్:
గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ ఉపయోగించి మీ పిల్లల రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించండి. ఆహార ఎంపికలు, శరీరక సమస్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం.

• ఆరోగ్యకరమైన ఆహారం :
పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఇలా ఆరోగ్యకరమైన ఆహారాలను పిల్లలకి అందించాలి. అధిక చక్కెర స్థాయిలు ఉండే ఆహారాన్ని పిల్లలకి అస్సలు అందించకూడదు.

•శారీరక శ్రమ :
ఖాళీ సమయంలో మీ పిల్లలతో శారీరక శ్రమలో పాల్గొనండి. వ్యాయామం, యోగ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మీ ఆరోగ్యం కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది.