లియో ట్విట్టర్ రివ్యూ.. విజయ్ హిట్ కొట్టినట్టేనా..?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తోందంటే చాలు హడావిడి కూడా తారాస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఆ పరిస్థితి ఎవరు ఊహించలేనిది. అంతలా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వందల కోట్లు వసూలు చేస్తోంది . దీన్ని బట్టి చూస్తే ఆయన క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే తాజాగా ఆయన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో లియో సినిమాను ఈరోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ సినిమా రాగా .. అనుకున్న స్థాయిలో అలరించలేదు. అయితే ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలని లోకేష్ పట్టుపట్టారు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. మరొకవైపు థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ లో కూడా రికార్డులు సృష్టించింది ఇలా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. ఈ షో ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శితం అవుతున్నాయి.

అక్కడ సినిమా చూసినవాళ్లు తమ అభిప్రాయాలను ఎక్స్ ద్వారా వెల్లడిస్తున్నారు.మొదటి భాగం సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకోగా.. ఇక రెండవ భాగం అంతకుమించి అదిరిపోయిందని.. సినిమా వేరే లెవెల్ అని కొనియాడుతున్నారు. ఇక లోకేష్ కనగరాజు టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అని, అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం కూడా భారీగా కుదిరిందని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో యాక్షన్ కింగ్ అర్జున్ పరిచయం కాస్త అదిరిపోయింది అని, అదే సినిమాకు హైలైట్ అని కూడా చెబుతున్నారు. అంతేకాదు హైనాతో మంచు లో విజయ్ ఫైట్ సీను చాలా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఈ సినిమా విజయ్ కి భారీ విజయాన్ని అందించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.