కత్రినా కైఫ్ బాడీ గార్డ్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మొదటి పరిచయంతోనే భారీగా ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె తెలుగులో అడుగుపెట్టిన మొదట్లోనే 75 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషకం అందుకొని అప్పట్లో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన కత్రినా కైఫ్ త్వరలోనే టైగర్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా మరొకవైపు కత్రినా కైఫ్ టైగర్ త్రీ సినిమాలో హద్దులు దాటి గ్లామర్ షో చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కి 48 మిలియన్ల వ్యూస్ కూడా రావడం గమనార్హం. అంతేకాదు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా గెస్ట్ రోల్ పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా 40 సంవత్సరాల వయసులో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. వయసు పెరుగుతున్నా కూడా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం అందుకుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఆమె బాడీగార్డ్ జీతం కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కత్రినా కైఫ్ బాడీ గార్డ్ పేరు దీపక్ సింగ్.. ఇక ఇతని జీతం ఏడాదికి కోటి రూపాయలు అని సమాచారం. ఏది ఏమైనా కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కోసం ఏడాదికి కోటి రూపాయలు వెచ్చిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న ఈమె జనాల్లోకి రావాలి అంటే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చి ఒక బాడీ గార్డ్ ని తప్పకుండా పెట్టుకోవాల్సిందే అన్న కామెంట్లు మరి కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.