బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్లస్, మైనస్ ఇవే.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వగా.. పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మార్నింగ్ బెనిఫిట్ షోలో అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతుండగా.. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాతో బాలయ్య మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య మార్క్‌కు తగ్గట్లు సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అభిమానులు బాలయ్యను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలాగే చూపించారని అంటున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ వేరే లెవల్ లో ప్లాన్ చేశారని అంటున్నారు. సెకండాఫ్ లో 20 నిమిషాల పాటు తన నటనతో బాలయ్య విశ్వరూపం చూపించాడని అంటున్నారు. బాలయ్య గెటప్ చాలా కొత్తగా ఉందని, విభిన్నంగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు.

బాలయ్య నటన, శ్రీలీల యాక్టింగ్, థమన్ బీజీఎం ఈ సినిమాకు పాజిటివ్ గా మారాయని సినీ క్రిటిక్స్ అంటున్నారు. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ కూడా బాగా చేశాడని రివ్యూ ఇస్తున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా సినిమా ఉందంటున్నారు. అయితే మైనస్ ల విషయానికొస్తే.. కాజల్ రోల్, కొన్ని ఫైట్ సీన్స్ సరిగ్గా తీయలేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే సినిమా బాగుందని, బాలయ్య మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడని చెబుతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీకెండ్స్ లో కలెక్షన్లు పెరుగుతాయని బావిస్తున్నారు.