పాలిటిక్స్ లోకి శృతి హాస‌న్.. స్వ‌యంగా ఓపెన్ అయిపోయిన స్టార్ కిడ్‌!

క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో `స‌లార్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే హాలీవుడ్ లో శృతి `ది ఐ` అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది.

సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎప్ప‌టి నుంచో శృతి హాస‌న్ పాలిటిక్స్ లోకి ఎంట‌ర్ అవ్వ‌బోతోంద‌ని కోలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళ స్టార్‌, మ‌క్క‌ల్ ఇయ‌క్కం పార్టీ అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురు కావ‌డంతో.. శృతి హాస‌న్ ఎక్క‌డికి వెళ్లినా పొలిటిక‌ల్ ఎంట్రీపై ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విష‌యంపై ఆమె ఓపెన్ అయిపోయింది.

కోయంబ‌త్తూరు లో మీడియాతో ముచ్చ‌టించిన శృతి హాస‌న్ ను ఓ రిపోర్ట‌ర్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం గురించి ప్ర‌శ్నించాడు. అందుకు ఆమె బ‌దులిస్తూ.. ప్ర‌స్తుతానికి రాజకీయాల‌పై త‌న‌కు ఎలాంటి ఆస‌క్తి లేద‌ని.. అటు వైపుగా అడుగులు వేసే ఆలోచ‌నే రాలేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌న ఫోక‌స్ మొత్తం ఇప్పుడు సినిమాల‌పైనే ఉంద‌ని తెగేసి చెప్పింది. నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని శృతి కుండ‌బ‌ద్దలు కొట్టింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.