సెన్సార్ పూర్తి చేసుకున్న ” టైగర్ నాగేశ్వరరావు “.. రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. దేశాన్ని గజగజలాడించిన స్టువర్టుపురం దొంగ అయినా నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకి చాలా విశిష్టతలు ఉన్నాయి. రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. అలాగే ” కార్తికేయ 2 ” ‘ ది కాశ్మీర్ ఫైల్స్ ‘ వంటి పాన్ ఇండియా హిట్లు కొట్టిన అభిషేక్ అగర్వాల్ నిర్మించిన సినిమా.

ఇదే సినిమాతో కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ టాలీవుడ్ కి హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. దీంతో ఈ సినిమాపై భార్య అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ చిత్రానికి కొన్ని కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ను జారీ చేసింది చిత్ర బృందం. కొన్ని చోట్ల వయోలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ విధించినట్లు తెలుస్తుంది.

అయితే రన్ టైం మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది అనే చెప్పాలి. ఎందుకంటే ” టైగర్ నాగేశ్వరరావు ” రన్ టైం ఏకంగా 3:1:39 గంటలు వచ్చిందట. అంటే ప్రేక్షకులు దాదాపు 3 గం. 20 ని పాటు థియేటర్ల లో ఉండాల్సిందే. వాస్తవానికి టైగర్ నాగేశ్వరరావు కథ చాలా పెద్దది. ఒక భాగంలో చెప్పేది అయితే కాదు. కానీ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని మూడు గంటల్లో చూపించడానికి మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తుంది.