తెలివిగా తమ సినిమాలకు మార్కెట్ పెంచుకుంటున్న మీడియం రేంజ్ హీరోలు వీళ్లే..

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి హీరోకు ఒకటే ధ్యాస ఉంటుంది. తమ మార్కెట్ ఎలాగైనా పెంచుకొని స్టార్ హీరోస్గా గుర్తింపు తెచ్చుకోవాలని. దాని కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయోగాలు చేసిన అవన్నీ వర్కౌట్ అయి స్టార్ హీరోలుగా నిలబడితే చాలు అని వారు భావిస్తారు. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్లంతా ఒక్కటే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. నాని, విజయ్ దేవరకొండ దేవరకొండ లాంటి హీరోలకు అది సక్సెస్ కూడా అందించింది.

అయితే మన దగ్గర రూ.100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో టాప్ పొజిషన్లో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు. వీరి సినిమాలు హిట్‌,ఫ్లాపులతో సంబంధం లేకుండా మొదటి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను సంపాదిస్తున్నాయి. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టరైతే రూ. 400 కోట్ల కలెక్షన్ కూడా వసూలు చేస్తున్నాయి. అయితే వాళ్ల తర్వాత ప్లేస్ ల కోసం చాలా మంది హీరోలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టైర్‌2 హీరోలలో నెంబర్ వన్ ప్లేస్ నాదంటే నాదంటూ చాలా రోజులుగా నాని, విజయ్ దేవరకొండ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. నానికి హిట్స్ ఉన్నాయి.

కానీ విజయ్ కి మార్కెట్ ఉంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాల హవా మొదలైన తర్వాత మీడియం రేంజ్ హీరోల ఆలోచన శైలే మారిపోయింది. వైడ్‌ రేంజ్ మార్కెట్ ఉన్నప్పుడు మనం ఎందుకు మన బడ్జెట్ లోనే సినిమాలు చేసుకోవాలని ప్రతి ఒక్క హీరో ఆలోచిస్తున్నాడు. అదే విషయాన్ని నిర్మాతలకు చెప్పి భారీ బడ్జెట్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. ముందు బడ్జెట్ పెరిగితే.. హీరో రేంజ్ కూడా పెరుగుతుంది.. అదే కోవలో లైగ‌ర్ మూవీ ప్లాప్ అయినా ఫస్ట్ డే రూ. 32 కోట్ల వ‌స్సుళ్ళు కొల్లగొట్టింది. అసలు ఆ రేంజ్ కలెక్షన్స్ మామూలు సినిమాలకైతే రావు.

ఈ విషయాన్ని గ్రహించారు మిడిల్ రేంజ్ హీరోలు. ఇక ఇటీవల శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు కేవలం నాన్ ధియేటర్ రైట్స్ రూ. 50 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసింది. దానికి కారణం ఆ సినిమా గ్రాండియ‌రే. ముందు బడ్జెట్ పెంచండి.. అది హిట్ అయితే మార్కెట్ కూడా పెరుగుతుంది.. అని స్ట్రాటజీని యూజ్‌ చేస్తున్నారు మన మిడిల్ రేంజ్ హీరోలు.