బర్తడే వేడుకలలో రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. షాకింగ్ వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతను కూతురు మంచు లక్ష్మి అందరికీ సుపరిచితురాలే.. ఈమె నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకుంది. అయితే హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఫీమేల్ మూవీస్ తో తనదైన ముద్రను సృష్టించుకుంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన వాళ్ళందరూ ఇంచుమించుగా మంచు లక్ష్మితో మంచి బాండింగ్ కొనసాగిస్తూ ఉంటారు. ఇక తన డ్రెస్సింగ్ సెన్స్ అలాగే తన చీర కట్టుకు ఫిదా అయిపోవాల్సిందే. ఎందుకంటే హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్ ఫోటోషూట్లకు ఫోజులిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మంచు లక్ష్మీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా ఒక మూవీ ఫస్ట్ లుక్ వచ్చింది. థ్రిల్లర్ జోనర్ కథలతో మంచు లక్ష్మి ఎక్కువగా నటిస్తూ ఉంటుంది. సినిమాల కంటే మంచు లక్ష్మి లైఫ్ స్టైల్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇక ఈ విషయాలు కాస్త పక్కన పెడితే..తాజాగా మంచు లక్ష్మి బర్తడే పార్టీకి సంబంధించిన ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. పింక్ కలర్ షార్ట్ టాప్ ధరించి చిన్నపిల్లలా మారిపోయి.. పార్టీలో మంచు లక్ష్మి ఫుల్ గా సందడి చేస్తూ ఎంజాయ్ చేసింది. ఈ బర్తడే పార్టీకి ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరూ అటెండ్ అయ్యారు. బర్తడే పార్టీలో ఆమె అందర్నీ పలకరిస్తూ సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని వీడియోగా ఇన్స్టా లో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది. ఇక ఈ వీడియోలో మంచు లక్ష్మి వేసుకున్న డ్రెస్ పై కొంతమంది నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరికొందరు వేరే విధమైన కామెంట్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఫాలోవర్స్ అయితే ఈ డ్రెస్ లో మంచు లక్ష్మి చాలా అందంగా ఉంది అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.