లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు ఏం చేశారో తెలిస్తే షాక్..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం హాట్ టాపిక్ గా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ప్రేమలో పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అలా గత కొద్దికాలంగా ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం వీరు పెళ్లి ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో వీరి గురించి తరచూ ఏదోక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక వీరిద్దరూ తమ వివాహాన్ని ఇటలీలో చేసుకోబోతున్నారు అంటూ ఉపాసన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లీక్ చేశారు.

అయితే వీరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వీరి వివాహం అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలోనే జరుగుతుందని తెలుస్తుంది. ఇక లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ వివాహం జరగబోతుందని విషయం తెలియడంతో ప్రతి ఒక్కరూ లావణ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు మెగా ఫ్యామిలీ లావణ్యని కోడలుగా అంగీకరించడం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక మెగా ఫ్యామిలీతో పోల్చుకుంటే లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఏమాత్రం తీసుపోదని చెప్పాలి.

లావణ్య త్రిపాఠి నార్త్ ఇండియాకు చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయి లాగే ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక వీరికి ఆస్తిపాస్తులు కూడా భారీగానే ఉన్నాయనే చెప్పాలి. ఇక లావణ్య త్రిపార్టీ కి ఒక సోదరుడుతో పాటు ఒక సోదరి కూడా ఉన్నారు. వీరి తల్లి గవర్నమెంట్ టీచర్ , తండ్రి హైకోర్టు న్యాయమూర్తి గా చేశారట. ఇక వీరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుగా లేదు. ఇక లావణ్య- వరుణ్ ను ప్రేమిస్తున్నాను అని విషయం తెలియడంతో మొదట్లో షాక్ అయినటువంటి లావణ్య కుటుంబం అనంతరం మెగా కుటుంబం గురించి వరుణ్ తేజ్ గురించి తెలిసి ఈ పెళ్ళికి ఓకే చెప్పారట.