వెంకటేష్ – రామ్ చరణ్ కాంబోలో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన వెంకటేష్ కంటెంట్ పరంగా హిట్ అవుతుంది అనుకున్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ నటిస్తాడు. ఇక ఇప్పటివరకు వెంకటేష్ నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ గానే నిలిచాయి. తండ్రి దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సొంత టాలెంట్ తో ఎదిగిన వెంకటేష్ కోట్లాదిమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. ఇక తన మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో వెంకటేష్ ఎన్నో హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడు.

ఈ లిస్టులోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు గోవిందుడు అందరివాడేలే. నిజానికి ఈ సినిమా వెంకటేష్, రామ్ చరణ్ కాంబినేషన్లో రావాల్సింది. కానీ అది జరగలేదు. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ – కాజల్ అగర్వాల్ జంటగా సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. ప్రకాష్ రాజ్, కమల్నీ ముఖర్జీ, జయసుధ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటించారు. పరమేశ్వర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకి యువాన్ శంకర్ రాజ స్వరాలు అందించాడు.

2014 అక్టోబర్ 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర తర్వాత మెయిన్ హైలెట్ అయిన క్యారెక్టర్ శ్రీకాంత్. బాబాయ్ , అబ్బాయిల్లా వీరు నటించారు. మొదట శ్రీకాంత్ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ కృష్ణవంశీ వెంకటేష్ నే అనుకున్నాడట. వెంకటేష్ మాత్రం ఆ క్యారెక్టర్ తనకు పెద్దగా సూట్ కాదంటూ సున్నితంగా రిజెక్ట్ చేసాడు. దీంతో వెంకటేష్‌కు బదులు శ్రీకాంత్ ఆ సినిమాలో నటించాడు. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్‌లో ఆ సినిమా వచ్చుంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.