తమ‌ స్నేహితుల‌ దగ్గర నుంచి దొంగతనం చేయాల‌ని ఆదేశించిన బిగ్ బాస్.. కట్ చేస్తే మ‌రో ట్విస్ట్..!!

బిగ్ బాస్ లో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఐదో వారంలోకి అడుగు పెట్టారు. ‌ కానీ ఈ సీజన్లో పెద్దగా జోష్ అయితే కనిపించలేదు. గేమ్స్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గవి జరగలేదు. అయితే తాజాగా కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన గేమ్ ఇప్పటివరకు అయినా వాటితో పోలిస్తే కాస్త ఇంట్రెస్టింగా కనిపించింది. ఇందులో ఊహించని వ్యక్తులు విజేతలుగా నిలవడం విశేషం. ఇంతకీ హౌస్ లో మంగళవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా స్మైల్ ప్లీజ్ అని ఫస్ట్ టాస్క్ పెట్టారు. చాలా గందరగోళంగా సాగిన అందులో గౌతమ్, శుభశ్రీ విజేతలుగా ప్రకటించారు. అయితే యావర్ తీరుపై హౌస్ లోని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడి నుంచి మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. రాత్రంతా ఆ గొడవ అలానే సాగింది. ఇక కెప్టెన్సీ పోటీలో భాగంగా ” దొరికితే దొంగ దొరక్కపోతే దొర ” అనే రెండో టాస్క్ పెట్టారు. అందులో భాగంగా యాక్టివిటీ రూమ్లో బిగ్ బాస్ ఫ్రెండ్ నిద్రపోతుంటాడు. ఆ రూమ్ లోకి జోడీల్లో ఒక్కొక్క సభ్యుడు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లిన తర్వాత బిగ్‌బాస్ చెప్పిన క్లూస్ బట్టి అక్కడ ఉన్న వస్తువులని దొంగలించాల్సి ఉంటుంది. ఈ ఆట బాగానే సాగింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ వస్తువుని కింద పడేయడంతో దాన్ని పక్కనే ఉన్న యావర్ తీసుకుని తన సంచిలో పెట్టుకుంటాడు.

దీంతో బయట అంతా గందరగోళంగా మారుతుంది. అయితే ఈ గేమ్ లో భాష రాణి కారణంగా శుభశ్రీ, యావర్ చేతికి దొరికిన వస్తువులన్నీ పట్టుకొస్తారు. అయితే క్లూస్ ఆధారంగా చెప్పిన వస్తువులు కాకుండా రూమ్ లో నుంచి వేరే వస్తువులు కూడా తీసుకురావడంపై బిగ్‌బాస్ సీరియస్ అవుతాడు. అలా బిగ్‌బాస్ చెప్పని వస్తువులు ఎవరైతే తక్కువ తెస్తారో వారు మొదటి ప్లేస్ లో ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు. అలా శివాజీ, ప్రశాంత్ ఇందులో విజయం సాధించారు.

రెండో టాస్క్ లో భాగంగా ఫ్రూట్ నింజా గేమ్ పెడతారు. ఇందులో భాగంగా జోడీలన్నీ ఒకరు.. దూరంలో ఉన్న మరో వ్యక్తి తలపై ఉన్న బకెట్లో పండ్లని వేయాల్సి ఉంటుంది. ఆ వేసిన వాటితో వారు చేతులతో జ్యూస్ పిండాల్సి ఉంటుంది. అలా ఎవరు ఎక్కువైతే పిండుతారో వాళ్ళు విజేతలుగా నిలుస్తారు. ఇందులో తేజ, యావర్ విజేతలుగా నిలిచారు. ఓవరాల్ గా చూసుకుంటే గౌతమ్- శుభశ్రీ 4 స్టార్స్, అమర్దీప్- సందీప్ 4 స్టార్స్, ప్రశాంత్-శివాజీ 5 స్టార్స్, ప్రియాంక-శోభ 2 స్టార్స్, తేజ-యావర్ 2 స్టార్స్ సాధించారు.