జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సింపుల్ టిప్స్….!!

చాలామంది జుట్టు రాలడాన్ని పెద్ద సమస్యగా భావించి డిప్రెషన్ కు గురవుతారు. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించి.. వెంట్రుకలు మళ్లీ పెరిగేలా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

*వారానికి ఒకటి రెండు సార్లు తలకు మసాజ్ చేయడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. లెమన్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్ వంటి నూనెతో మసాజ్ చేస్తే కుదుళ్లకు రక్త ప్రసరణ పెరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

* కెరోటిన్ అనే ప్రోటీన్ తో జుట్టు నిర్మితమవుతుంది. కోడిగుడ్డు లో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కోడిగుడ్డు, యోగర్ట్ కలిపి తడి జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

* విటమిన్ సి లోపం వల్ల కూడా జుట్టు రాలడం సమస్య తలెత్తుతుంది. అందువల్ల విటమిన్ సి ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలని తినాలి.

* రెగ్యులర్ గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల జుట్టు చివర్లు చిట్లడం సమస్య తగ్గి వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.

* జుట్టు పెరుగుదలను పెంచే దానిలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత షాంపూ తో క్లీన్ చేసుకోవాలి.

* జుట్టు రాలడం సమస్యను తగ్గించడంలో అలోవెరా కూడా బాగా సహాయపడుతుంది. ఇది కుదుళ్లకు బలాన్ని చేకూర్చి జుట్టును దృఢంగా చేస్తుంది.

* ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాళ్ళడం సమస్య ఎదురవుతుంది. అందువల్ల ఐరన్ ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవాలి.