ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈసారైనా ప‌రువు నిల‌బెట్టండ్రా అబ్బాయిలు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే రాబోతోంది. అక్టోబ‌ర్ 23వ తేదీన ప్ర‌భాస్ త‌న 44వ పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకోబోతున్నాడు. బ‌ర్త్‌డే కాబ‌ట్టి.. ఆయ‌న చేస్తున్న సినిమాల నుంచే ఏదో ఒక అప్డేట్ రావ‌డం కామ‌న్. అయితే వాటిలో పాటు మ‌రో స‌ర్‌ప్రైజ్ కూడా ఉంది. డార్లింగ్ బ‌ర్త్‌డేకు ఓ సినిమా విడుద‌ల కాబోతోంది. ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు `ఛత్రపతి`.

గ‌త కొంత కాలం నుంచి తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఛ‌త్ర‌ప‌తిని.. ఆయన బ‌ర్త్‌డే కానుక‌గా 4కె క్వాలిటీతో మ‌ళ్లీ విడుదల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇది నిజంగా ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఛ‌త్ర‌ప‌తి విష‌యానికి వ‌స్తే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది.

ఈ చిత్రంలో ప్ర‌భాస్‌, శ్రియా జంట‌గా న‌టించారు. మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం.. 2005లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌భాస్ కు స్టార్ ఇమేజ్ ను అందించ‌డ‌మే కాకుండా.. మాస్ ఆడియెన్స్ లో డార్లింగ్ కు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. మ‌ళ్లీ 18 ఏళ్ల త‌ర్వాత ఛ‌త్ర‌ప‌తి థియేట‌ర్స్ లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ప్ర‌భాస్ న‌టించిన‌ వర్షం, బిల్లా సినిమాలు ఇదివరక‌ రీ రిలీజ్ అయ్యాయి. కానీ, వాటికి పెద్ద రెస్పాన్స్ రాలేదు. మ‌రి ఈసారైనా ఫ్యాన్స్‌ ఛ‌త్ర‌ప‌తితో రికార్డులు తిర‌గ‌రాసి.. ప్ర‌భాస్ ప‌రువు నిల‌బెడ‌తారా? లేదా? అన్న‌ది చూడాల్సి ఉంది.