నోరు జారిన బోయ‌పాటి శ్రీ‌ను.. ఇచ్చిప‌డేసిన థ‌మ‌న్‌.. ఇది అస‌లైన పంచ్ అంటే..!!

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకడు. ఇప్పటివరకు థ‌మన్ వర్క్ చేసిన సినిమాల్లో పాటల గురించి పక్కన పెడితే నేపథ్య సంగీతం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందులోనూ ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలకు థ‌మ‌న్ బీజీఎమ్ తోడైతే బ్లాక్ బ‌స్ట‌రే అన్న టాక్ ఉంది. వీరిద్ద‌రిదీ హిట్ కాంబినేష‌న్. వీరి కాంబోలో వ‌చ్చిన స‌రైనోడు, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించాయి.

ముఖ్యంగా అఖండ స‌క్సెస్ లో థ‌మ‌న్ ఇచ్చిన నేప‌థ్య సంగీతం కీల‌క పాత్ర పోషించింది. బాలకృష్ణ యాక్టింగ్‌కు, బోయపాటి మార్క్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు థ‌మన్ నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. అప్ప‌ట్లో సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ థ‌మ‌న్ బీజీఎమ్ చిత‌క్కొట్టేశాడంటూ కొనియాడారు. కానీ, తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బోయ‌పాటి శ్రీ‌ను మాత్రం.. అఖండ విష‌యంలో థ‌మన్ పీకిందేమి లేదంటూ తేల్చేశారు. థ‌మ‌న్ ను ఘోరంగా అవ‌మానించాడు. అఖండ త‌ర్వాత మ‌ళ్లీ బోయ‌పాటితో కలిసి థ‌మ‌న్ `స్కంద‌` మూవీకి వ‌ర్క్ చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. పైగా ఈ మూవీకి బోయ‌పాటి డైరెక్ష‌న్ తో పాటు థ‌మ‌న్ బీజీఎమ్ కూడా యావ‌రేజ్‌గానే ఉంది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బోయ‌పాటికి.. స్కంద సంగీతం బాలేదని కామెంట్స్ వ‌చ్చాయి. దీనిపై మీ స్పంద ఏంట‌ని ప్ర‌శ్నించారు. అందుకు బోయ‌పాటి `బాలేకపోతే ముందు నేనే యాక్సెప్ట్ చేయను` అని పేర్కొన్నారు. ఆపై అఖండ మ్యూజిక్ గురించి ప్ర‌స్థావ‌న రాగా.. `ఆ సినిమా ఆర్ఆర్ లేకుండా చూసినా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది` అంటూ బోయ‌పాటి థ‌మ‌న్ ను త‌క్కువ చేసి మాట్లాడాడు. దీంతో నెట్టింట ఈ మ్యాట‌ర్ హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది నెటిజ‌న్లు నోరు జారిన బోయ‌పాటిని ఓ ఏకేస్తున్నారు. ఇదే త‌రుణంలో థ‌మ‌న్ సైతం రంగంలోకి దిగి.. పేరు ప్ర‌స్తావించ‌కుండానే `ఐ డోంట్ కేర్` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గాలో బోయ‌పాటికి ఇచ్చిప‌డేశాడు. దీంతో ఇది అస‌లైన పంచ్ అంటే అనుకుంటూ నెటిజ‌న్లు థ‌మ‌న్ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.