ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ లో లావ‌ణ్య త్రిపాఠి ప‌ట్టుకున్న‌ ఆ మినీ బ్యాగ్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట.. ఏడడుగుల బంధంతో ఒకటి అయ్యేందుకు రెడీ అవుతున్నారు. జూన్ లో వీరి ఎంగేజ్మెంట్ జరగగా‌‌.‌. ఇప్పుడు పెళ్లి ఘడియలు కూడా దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను జ‌రుపుకున్నారు.

ఈ వేడుక‌లో కాబోయే వ‌ధూవ‌రుల‌తో పాటు చిరంజీవి-సురేఖ దంపతులు, నాగబాబు-పద్మజ దంపతులు, చిరంజీవి ఇద్దరు చెల్లెల్లు, వారి భర్తలు, రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌త‌లు, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, నిహారిక‌, చిరంజీవి తల్లి అంజనాదేవి.. ఇలా మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ హాజ‌రు అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఇప్ప‌టికే చిరంజీవి సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ లో లావ‌ణ్య త్రిపాఠి స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా క‌నిపించింది. ఎల్లో క‌ల‌ర్ సల్వార్ సూట్ కాబోయే మెగా కోడలు అంద‌రినీ ఆక‌ర్షించింది. అయితే ఇప్పుడు లావ‌ణ్య ప‌ట్టుకున్న మినీ బ్యాగ్ ధ‌ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూడ‌టానికి చిన్న‌గా ఉన్నా.. ఆ హ్యాండ్ బ్యాగ్ ధ‌రెంతో తెలిస్తే మాత్రం దిమ్మ‌తిరిగిపోద్ది. లావ‌ణ్య చేతిలో ఉన్న ఆ లెద‌ర బకెట్ హ్యాండ్‌బ్యాగ్ ప్రముఖ బ్రాండ్ ఫెండికి చెందినది. ఈ మినీ బ్యాగ్ ధర అక్ష‌రాల‌ రూ. 1,57,077. అంటే ల‌క్ష‌న్న‌ర పైమాటే. ఈ విష‌యం తెలిసి ఒక్క బ్యాగ్ కోసం లావ‌ణ్య అంట ఖ‌ర్చు పెట్టిందా.. ఎంతైనా కాబోయే మెగా కోడ‌లు క‌దా.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.