” బిగ్ బాస్ 7 ” కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి ఈ పది ఆసక్తికర విషయాలు తెలుసా..?

బిగ్ బాస్ 7 చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. కానీ ఐదు సీజన్లు వరకు మాత్రమే సక్సెస్ ఫుల్ గా సాగింది అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీలో రిలీజ్ చేసిన ఈ రియాలిటీ షో హావా తగ్గినట్లు కనిపించింది. సీజన్ 6 అయితే దారుణమైన టి ఆర్ పి రేటింగ్ నమోదైంది. దీంతో బిగ్ బాస్ పని ఇక అయిపోయింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కానీ బిగ్ బాస్ 7 ప్రీమియర్ కి ఏకంగా 14 టి ఆర్ పి రేటింగ్ నమోదయింది.

5.1 కోట్ల మంది ప్రేక్షకులు ఈ ప్రీమియర్‌ను స్టార్ మా వారు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక సీజన్ సెవెన్ కి ఐదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు టేస్టీ తేజ. బిగ్బాస్ సీజన్ 7 లో ప్రేక్షకులని కొద్దో గొప్ప ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఇతని గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. టేస్టీ తేజ పూర్తి పేరు తెనాలి తేజ. ఇతను 1994వ సంవత్సరంలో జూన్ 12న జన్మించాడు. ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి. ఇతనొక బి.టెక్ విద్యార్థి.

2. ఇతను ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టాక ముందు సాఫ్ట్ వేర్ డెవలపర్గా పనిచేశాడు.

3. ఇతని తండ్రి పేరు కల్లం శ్రీనివాస రెడ్డి. ఇతనికి అక్క ఉంది. ఆమె పేరు ప్రసన్న.

4. ఇతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అలాగే ఇతనిది హిందూ కుటుంబం.

5. ఇతను సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ముందుగా జబర్దస్త్ కామెడీ షో లో కొన్నాళ్లు పనిచేశాడు.

6. తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ లో ఫుడ్ వీడియోలకు యాంకరింగ్ చేస్తూ.. పాపులర్ అయ్యాడు.

7. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇతను ఫుడ్ వీడియోలు చేయడం జరిగింది.

8. సినిమా ప్రమోషన్ల కోసం ఇతని ఫుడ్ వీడియోస్ లో హీరో, హీరోయిన్లు కూడా పాల్గొనేవారు. అలా అతను ఇంకా ఫేమస్ అయ్యాడు.

9. తేజ కి పలు సినిమాల్లో చాన్సులు వచ్చినట్టే వచ్చి.. చేజారి పోయాయని తెలుస్తుంది. లేదంటే ఇతను కచ్చితంగా మరింత కమెడియన్ గా సెటిల్ అయ్యేవాడు.

10. తేజ కి గర్ల్ ఫ్రెండ్స్ వంటి వారు లేరట. గతంలో కొంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేసినప్పటికీ వాళ్లు రిజెక్ట్ చేశారని ఫన్నీగా చెబుతూ ఉన్నాడు. అయితే ఇతను సెలబ్రిటీ అయ్యాక చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసి మాట్లాడడం ఇతనికి సంతోషాన్ని కలిగించిందట.