టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటిస్తే.. శ్రీకాంత్, దగ్గుపాటి రాజా, ఇంద్రజ, గౌతమి తదితరులు కీలకపాత్రను పోషించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ స్కంద ప్రేక్షకులం ముందుకు వచ్చింది.
అయితే అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలం అయింది. స్కందకు మిక్స్డ్ టాక్ లభించింది. దాంతో లాంగ్ వీకెండ్ కలిసి వచ్చినా.. ఈ సినిమా ఇంకా రూ. 16 కోట్ల దూరంలోనే ఆగిపోయింది. స్కందతో రామ్ ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయమైంది. అయితే స్కంద ప్లాప్ అయినప్పటికీ.. రామ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు.. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో ఈ సినిమా వసూళ్లను అందుకుంది.
రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా స్కంద మొదటి స్థానంలో నిలిచింది. టోటల్ వసూలు పరంగా చూస్తే.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా స్కంద రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. రామ్ మార్కెట్ కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఈ నేపథ్యంలోనే రామ్ హ్యాపీగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన `డబుల్ ఇస్మార్ట్` పై ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది.