నాగుపాముతో ఆట‌లు ఆడుతున్న ఈ చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమ‌స్ సెల‌బ్రిటీ!

పైన ఫోటోలో నాగుపామును పట్టుకుని ఆటలు ఆడుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. నటిగానే కాకుండా ఆమె హోస్ట్ గా, నిర్మాతగా కూడా సత్తా చాటుతోంది. సీనియర్ స్టార్ హీరో కూతురు. ఆమెకు ఇద్దరు సోదరులు కాగా.. వారు కూడా హీరోలే. ఈపాటికి ఆమె ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఎస్ ఆమె మంచు లక్ష్మినే.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. 2011లో విడుదలైన `అనగనగా ఓ ధీరుడు` మూవీతో తెలుగు ప్రేక్షకుల‌ను పలకరించింది. ఈ సినిమాలో లేడీ విలన్ గా అందర్నీ అలరించింది. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. నిర్మాతగా, హోస్ట్ గా కూడా రాణిస్తోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మంచు లక్ష్మి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.

మోహ‌న్ బాబు హీరోగా న‌టించి, నిర్మించిన `ప‌ద్మ‌వ్యూహం` సినిమాతో మంచు ల‌క్ష్మి వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది. ఈ సినిమాలో మోహ‌న్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒక‌టి గుడిపూజారి పాత్ర‌. అయితే గుడిపూజారి పాత్ర‌లో న‌టించిన మోహ‌న్ బాబు కూతురు గా మంచి ల‌క్ష్మి చేసింది. 1980లో విడుద‌లై ప‌ద్మ‌వ్యూహం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఇక మంచు ల‌క్ష్మి అనగనగా ఓ ధీరుడు మూవీ కంటే ముందే.. మాలీవుడ్ లో ప‌లు సినిమాలు, టీవీ సిరీస్ ల‌లో యాక్ట్ చేసింది. అన్న‌ట్లు ఈ రోజు మంచు ల‌క్ష్మి పుట్టినరోజు. దీంతో సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులు, సినీ త‌రాలు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.