ప్రభాస్ మూవీ పై స్పందించిన డైరెక్టర్ మారుతి.. ఆ రూమర్లకు చెక్.. !

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ మూవీ స‌లార్‌లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ సినిమాల‌లో న‌టిస్తున్నాడు. మారుతి – ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ రాజా డీలక్స్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. కనీసం ప్రారంభమైందనే వార్త కూడా తెలియలేదు. షూటింగ్ ఎంతవరకు అయింది.. ఏం జరుగుతుందని.. అప్డేట్స్ మూవీ టీం ప్రకటించలేదు. వాళ్ళు ఈ సినిమాను పూర్తిగా సీక్రెట్ గా రూపొందిస్తున్నారు. అనేక సందర్భాల్లోనూ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఈ సినిమాపై స్పందించేందుకు నిరాకరించారు. ఒక మంచి సందర్భంలో ఈ సినిమా గురించి మాట్లాడుతామని చెప్పుకొచ్చారు.

ఈ నేప‌ద్యంలో ఎట్టకేలకు దర్శకుడు మారుతి సినిమాపై స్పందించాడు. సినిమా జోనర్, షూటింగ్, రిలీజ్ లాంటి అన్ని అంశాలపై చెప్పుకొచ్చాడు. దీంతోపాటు సినిమాపై వచ్చిన రూమర్లకి కూడా ఆయన చెక్ పెట్టాడు. అయితే ప్రభాస్ సినిమా గురించి ఏదో ఇంటర్వ్యూలో కాదు సపరేట్ ఇంటర్వ్యూ నే పెట్టాడు. అది చాలా పెద్ద కథ అని చిన్నగా చెప్పడం సరిపోదట చెప్పుకొచ్చిన మారుతి.. సినిమా కథను చెప్పడం ఇష్టం లేక ఇలా దాటేశారు అంటూ రియాక్ట్ అవుతున్నారు జ‌నం. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్‌, ఫ్యామిలీ ఎలిమెంట్లతో రాబోతుందట.

కచ్చితంగా ప్రభాస్ సినిమాలో ఆయా అంశాలు ఉంటాయన్నారు. అలా హీరో సినిమాలో కామెడీ చేస్తాడని క్లారిటీ ఇచ్చేశాడు. భారీ సినిమాల మధ్య మంచి కామెడీ సినిమా చేయాలని ఉందని గతంలో ప్రభాస్ చెప్పిన మాటలను రిపీట్ చేస్తూ ఈ సినిమా అదే అంటూ చెప్పుకొచ్చాడు మారుతి. ప్రభాస్ ఇమేజ్‌కి త‌గ్గ‌టుగా భారీ స్కేల్ లో ఈ సినిమా తెర‌కెక్కుతుందని గ్రాండ్ ఇయర్ విషయంలో రాజీ పడేదే లేదంటూ చాలా లావిషివ్‌గా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. సినిమాని ప్రభాస్ లేకుండా షూట్ చేస్తున్నారనూ రూమ‌ర్ల‌పై మారుతి రియాక్ట్ అయ్యాడు. కొన్ని సినిమాల్లో హీరో అవసరం లేదు బ్యాక్ నుంచి తీసే సీన్‌ల‌కు, కాళ్లు చేతులు మాత్రమే కనిపించే సన్నివేశాలకు హీరో అవసరం లేదని వివ‌రించాడు.

బాడీ డబుల్ ని పెట్టి షూట్ చేస్తారని తను కూడా అదే చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు సంబంధించిన అందరూ అదే ఫాలో అవుతారని. ప్రతి హీరోకి డూప్స్‌ ఉంటారని వివరించాడు. మారుతి – ప్రభాస్ లేకుండా నేను సినిమా చేస్తే అది హీరోకి తెలియదా ఆయన ఒప్పుకుంటాడా రేపు థియేటర్లో ఆడియన్స్ చూస్తే ఊరుకుంటారా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ అప్డేట్ కూడా ఇచ్చేశాడు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవ్వ బోతుందట. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ ఈ విషయాలను వివరించాడు.