మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ ఎవరి బ్రాండ్ వాల్యూ ఎక్కువ..?

అల్లు అర్జున్ ఇటీవల కాలంలో వరుసగా బ్రాండ్ ప్రమోషన్స్ కి ఓకే చెప్తున్నా సంగతి తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో ఎదిగింది. పుష్పాలో త‌న న‌ట‌న‌కు అల్లు అర్జున్ బెస్ట్ హీరో నేష‌న‌ల్ అవిర్డ్‌ను అందుకున్నాడు. దీంతో బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ క్రేజ్ దక్కించుకున్నాడు. అలాగే సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న పుష్పరాజ్‌తో తమ బ్రాండ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసుకునేందుకు పెద్దపెద్ద కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.

అంతేకాకుండా రికార్డ్స్ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ యాడ్ ను చేస్తే ఆ యాడ్ ని దేశం మొత్తం కూడా టెలికాస్ట్ చేయవచ్చు. కనుక ఆయనకు పాన్ ఇండియా రేంజ్‌లోనే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కూడా చాలా సంస్థల యొక్క ఉత్పత్తులను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే సౌత్ ఇండియా లేదా తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే మహేష్ బాబు నటించిన యాడ్స్‌ టెలికాస్ట్ అవుతూ ఉంటాయి.

కనుక మహేష్ బాబు తో పోల్చితే అల్లు అర్జున్ బ్రాండ్ వేల్యూ ప్రస్తుతం ఎక్కువగా ఉంది. అందుకే పారితోషకం కూడా బన్నీకి భారీగా ఇస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు చాలా ఏళ్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా నటిస్తున్నా పెద్ద మొత్తంలో సంపాదించుకోలేదు. అయితే అల్లు అర్జున్ ఈమధ్య ఎంట్రీ ఇచ్చిన భారీ మొత్తంలో రెమ్యునరేషన్ సొంతం చేసుకున్న కారణంగా తక్కువ సమయంలోనే మహేష్ బాబు కంటే ఎక్కువ సంపాదన దక్కించుకునే అవకాశాలు అల్లు అర్జున్‌లో ఎక్కువ కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ మీడియా వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.