బాహుబలి-2 సినిమా నుంచి డిలీట్ సీన్.. వీడియో వైరల్..!!

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన చత్రపతి బాహుబలి సిరీస్ సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో చెప్పాల్సిన పనిలేదు.. ఈ రెండు చిత్రాలు ఇండస్ట్రీ లో టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై పలు రకాల రికార్డులను కూడా అందుకుంది. ఇక బాహుబలి-2 సైతం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయిందని చెప్పవచ్చు. బాహుబలి సినిమాలో ఎన్నో ముఖ్యమైన సన్నివేశాలను సైతం డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే అలా డిలీట్ చేసిన సన్నివేశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఆ సీన్ డిలీట్ చేసి మంచి పని చేశారంటే పలువురు నెటిజెన్లు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఈ సన్నివేశంలో బాహుబలి ఫ్లిప్ కావడంతోపాటు గాయాల వల్ల బలమైన బండరాయి దగ్గర పడిపోవడం గమనించవచ్చు. ఈ సీన్ సినిమాలో ఉంటే నెగటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగా వచ్చేవి. ఈ సీన్ విషయంలో తప్పులను రాజమౌళి ముందుగానే గ్రహించి ఈసీన్ ని డిలీట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు.

దాదాపుగా బాహుబలి-2 సినిమా విడుదలై ఏడేళ్లు కావస్తువున్న ఇప్పటికీ డిలీట్ సన్నివేశం వైరల్ కావడంతో పలువురు అభిమానులు తెగ చూసేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బాహుబలి-3 సినిమా రాబోతోందని పలు సందర్భాలలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయం పైన ఇంతవరకు ప్రభాస్ కాని రాజమౌళి కానీ ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు. RRR చిత్రంతో పాండ్ ఇండియా డైరెక్టర్గా పేరుపొందిన రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.