సౌత్, నార్త్ లను షేక్‌చేస్తున్న రష్మిక.. లైన్ అప్ మామూలుగా లేదుగా.. !!

నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న‌ కన్నడలో కిర్రాక్ పార్టీ మూవీతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈమె తెలుగులో ఛ‌లో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వ‌రు, భీష్మ లాంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకొని నేషనల్ క్ర‌ష్‌గా గుర్తింపు తెచ్చుకున్న‌ రష్మిక మందన మిగిలిన హీరోయిన్స్ కంటే ఫుల్ జ‌ట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు రష్మిక చేతిలో అరడ‌జన్ పైగా సినిమాలు ఉన్నాయి. రష్మిక బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప 2 సినిమా కూడా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధనుష్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్లు తెరకెక్కబోతున్న సినిమాలో కూడా రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా షూట్ వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతుంది. రెయిన్‌బో అనే ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ లో రష్మిక నటిస్తుంది. ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇది వచ్చే ఏడాది తెలుగు, తమిళ్ వర్షన్స్ లో రిలీజ్ కాబోతుంది. హిందీలో విక్కి కౌశ‌ల్‌ సరసన చావా అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రవితేజ, గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో కూడా రష్మిక నటించబోతుందట. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ఫిమేల్ లీడ్ మూవీ లో కూడా రష్మిక నటిస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నట్లు సమాచారం. ఇన్ని సినిమాల్లో నటించిన అవకాశాలను అందుకున్న రష్మి అటు నార్త్ లోను ఇటు సౌత్ లోనూ బిజీ బిజీగా గ‌డుపుతుంది. రష్మికకు వచ్చిన ఈ సినిమాల్లో సగం పైగా భారీ అంచనాలు ఉన్న సినిమాలే కావడం విశేషం. వీటిలో యానిమల్, పుష్ప 2 రిలీజౌ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రష్మికా క్రేజ్ మరింతగా పెరుగుతుంది.