మీ గోర్లు మీ ఆరోగ్యాన్ని చూపిస్తాయి.. అది ఎలాగో తెలుసా..?

చాలామందికి గోర్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కొంతమంది గోర్లు లేకపోయినప్పటికీ.. ప్లాస్టిక్ గోర్లు ధరిస్తారు. అందంలో గోర్లని కూడా ఒక భాగంగా చూస్తారు. కానీ మీకు ఎవరికైనా తెలుసా… చేతి గోర్లు మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలు చెబుతాయని. ఎలా అని ఆలోచిస్తున్నారా…. గోర్లు రంగు బట్టి మన ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. గోర్లు ఏ రంగులో ఉంటే ఏ వ్యాధి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

*గోర్లు పెళ్ళుసుగా ఉంటే పోషకాహార లోపానికి గుర్తుగా భావించాలి.

* గోర్లు పసుపు రంగులోకి మారితే శ్వాస అవయవ జబ్బులను సూచిస్తాయి.

* గోర్లు ఫ్లాట్ గా ఉంటే ఊపిరితిత్తులు, పేగుకు సంబంధించిన సమస్యలకు సంకేతం.

* గోర్లు మీద తెల్లని మచ్చలు వస్తే లివర్, కిడ్నీ, థైరాయిడ్ సమస్యల కారణం కావచ్చు.

* గోర్లు నల్లగా మారడం చర్మ క్యాన్సర్ కు సంకేతం.

వీటిలో ఏ లక్షణాలు కనిపించిన డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.