ఎన్టీఆర్ మొదటి సినిమా ” మనదేశం “పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆత్యాభిమానాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహా నాయకుడు కూడా. నటుడుగా, రాజకీయ నేతగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం. ఎన్టీఆర్ సినీ ఎంట్రీ తెలుగు సినిమా చరిత్ర మారిపోయింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల గతిని మార్చింది. సినీరంగంలో ఆయన చేయని పాత్ర అంటూ లేదు.

సమాజ హితం కోసం తన ఇమేజిని పక్కకు పెట్టి.. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా మనదేశం. ఈ సినిమా 1949 నవంబర్ 24 న విడుదలైంది. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో పోషించారు. ” విప్రదాస్ ” అని బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. ప్రసిద్ధి నటుడు చిత్తూరు నాగయ్య, కృష్ణవేణి, రేలంగి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించారు. తెలుగువారి ఆరాధ్య దైవంగా మారిన ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా స్వతంత్రం రాకముందు ప్రభావితమైనా.. స్వతంత్రం వచ్చిన తరువాత విడుదలైంది.

ఇంకో విషయం ఏమిటంటే సంగీత దర్శకుడిగా ఘంటసాల వెంకటేశ్వరరావుకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమా తర్వాత బెంగాలీ నవలల ఆధారంగా తెలుగు సినిమాలు రూపుదిద్దుకున్నాయి. దేవదాస్, ఆదరణ వంటి సినిమాలు కూడా ఇదే పరంపరంలోనే వచ్చాయి. కాగా అన్న‌గారు తన తొలి సినిమా మనదేశం కు అందుకున్న పారితోషకం ఎంత అంటే. అక్షరాల రూ. 250లు. ఎన్టీఆర్ శత వేడుకల్లో భాగంగా రూపొందించిన ఎన్టీఆర్ సావనీర్ లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రూ.200తో కెరీర్ ను ప్రారంభించిన ఎన్టీఆర్ వెండితెరను మకుటం లేని మహారాజుగా ఏలారు. ముఖ్యంగా పౌరాణిక, జానపద చిత్రాల గతిని మార్చగలిగారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా మారారు.