రావణుడి అత్తారింట రాముని గుడి.. 35 ఏళ్లుగా తిరిగి చూడని జ‌నం..

రాముడి ఆలయం ఎక్కడ ఉన్నా సరే నిత్యం పూజలు జ‌రుగుతూ భ‌క్తుల‌తో క‌ల‌క‌ల‌లాడుతూ ఉంటాయి. అయితే లంకాధిపతి రావణుడి అత్తమామల నగరం ఉత్తర్ప్రదేశ్‌లో వెలిసిన ఓ రామాలయాన్ని మాత్రం 35 ఏళ్లుగా భక్తులెవరూ దర్శించుకోలేదట‌. ఎందుకు భక్తులు ఆ రామాలయానికి ఎందుకు వెళ్లడం లేదు..?కారణం ఏంటో..? ఇప్పుడు తెలుసుకుందాం.

రావణుడి అత్తమామల నగరంగా మేరఠ్ ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలోని ఎస్బిఐ ఉద్యోగుల కాలనీలో 1962లో రామాలయాన్ని నిర్మించారు. కృష్ణుడి విగ్రహంతో పాటు శివలింగం కూడా ఆలయంలో ప్రతిష్టించారు. 25 ఏళ్ల పాటు ఈ గుడి కళకళలాడింది. అయితే 1987లో మేరఠ్ లో జరిగిన ఇరు వర్గాల ఘటనలతో ఓ వర్గం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది.

ఇక కొన్నేళ్లు గడిచాక ఇక్కడ ఓ ఆలయం ఉందన్న మాటే నగరవాసులు అంతా మర్చిపోయారు. 1987 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక‌ 1989లో ఇక్కడికి వచ్చి స్థిరపడిన ఓ పూజారి ఆ దేవాల‌యాని శ‌ద్ది చేసి నిత్యం పూజలు చేస్తూ వ‌స్తున్నార‌ట‌. 2014లో ఆయన చనిపోయాక.. కుమారుడు ఆచార్య బాల్ గోవింద్ జోషి ఆ పూజలు చేస్తున్నాడు.