మరోసారి తెరపైకి సిద్ధార్థ – అదితి.. థియేటర్లో కెమెరాలకు చిక్కిన లవ్ బర్డ్స్..!!

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవల నటించిన మూవీ చిత్తా. నిమిషా విజయన్‌ హీరోయిన్గా, రెడ్ జాయింట్ మూవీస్, ఈ టాకీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. సేతుపతి మూవీ ఫేమ్ అరుణ్ కుమార్‌ దర్శకత్వం వహించ‌చిన ఈ మూవీ తమిళ్, మలయాళం, కన్నడ భాషలో సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ఫ‌స్ట్ షోతోనే పాజిటివ్ టాక్ అందుకుని మంచి షామ్‌లో దూసుకుపోతుంది. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తరికెక్కిన ఈ మూవీలో సిద్ధార్థ్ న‌ట‌న‌కి మంచి మార్కులు పడ్డాయి.

ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అనే అంశాన్ని స్వయంగా చూడడానికి సిద్ధార్థ్‌తో పాటు మూవీ యూనిట్ సభ్యులంతా కూడా చెన్నైలోని కొన్ని థియేటర్స్ విజిట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోస్ మేకర్స్ పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోలలో సిద్ధార్థ తో హైదరాబాద్ బ్యూటీ అదితిరావ్‌ హైదరి కూడా కనిపించింది. దీంతో ప్రస్తుతం అదితి – సిద్ధార్థ కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విరిద్ద‌రు ప్రేమలో ఉన్నారంటూ.. గత కొద్ది రోజులుగా న్యూస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అదితి రావ్‌కు సంబంధం లేదు.. అయినప్పటికీ మూవీ టీమ్‌తో కలిసి ఈమె కూడా థియేటర్స్ లో సందడి చేయడంతో జనం కూడా వీరిద్దరి మధ్యన లవ్ ట్రాక్ నడుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఈ వార్తలు పై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక చిత్తా సినిమా మంచి రెస్పాన్స్ సాధించడంతో తెలుగులో కూడా చిన్న పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 6న ఈ మూవీ తెలుగు వర్షన్ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.