” జగదేకవీరుడు అతిలోకసుందరి ” కంటెంట్ ఉపయోగిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం..!!

తెలుగు చిత్రసీమలో అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతి మూవీస్.. కాపీ రైట్ కు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది. 1974లో సి. అశ్వనీదత్ స్థాపించిన ఈ సంస్థ అగ్రశ్రేణి సినీ తారలను తీర్చిదిద్దడంతో పాటు భారీ బడ్జెట్ నిర్మాతలకు ప్రసిద్ధి చెందింది.

అయితే ఈ సంస్థ నిర్మాణంలో 1990లో చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సోషియో ఫాంటసీ మూవీ ” జగదేకవీరుడు అతిలోకసుందరి “. కాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ, సాంగ్స్, క్యారెక్టర్స్ తో పాటు మూవీ రీమేక్, ప్రీక్వెల్, వెబ్ సిరీస్ ఇతర ప్రసారం చిత్రాల్లో ఏ భాషలోనూ వాడుకోకూడదని పబ్లిక్ నోటీస్ జారీ చేసింది సంస్థ.

ఒకవేళ సమస్త అనుమతి లేకుండా ఎలాంటి కంటెంట్ వాడిన కాపీ రైట్స్ కింద చట్టపరంగా సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ” మా జగదేకవీరుడు అతిలోకసుందరి ” కంటెంట్ ని అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది “అంటూ ట్విట్టర్ వేదికగా నోట్ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)