ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ – బోయపాటి కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్‌లో సరైనోడు సినిమా వచ్చి హిట్ అయినా.. ఈ సినిమాకు బాగా ట్రోల్స్ ఎదురయ్యాయి. అల్లు అర్జున్ రేంజ్‌కి తగ్గ సినిమా సరైనోడు కాదని.. అయితే అల్లు అర్జున్ కు ఉన్న హైప్ తోనే సినిమా హిట్ అయిందంటూ కామెంట్స్ వినిపించాయి.
ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మరో సినిమా అని న్యూస్ రావడంతో బోయపాటితో మరో సినిమా తీయవద్దు ఆ డైరెక్టర్ కు దూరంగా ఉండండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి. ఇటీవల బోయపాటి తెరకెక్కించిన స్కంద సినిమా థియేటర్స్ లో చూసిన వారంతా వద్దు బాబాయ్ వద్దు కామెంట్స్ చేస్తున్నారు.
నెక్స్ట్ తీయబోయే సినిమాలైనా స్క్రిప్ట్ వేరే లెవెల్ లో ఉండకపోతే వరుసగా ఫ్లాపులు ఎదురవుతాయి అంటూ వార్న్ చేస్తున్నారు. బోయపాటి శ్రీనును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా తగ్గుతుంది. ప్రతి సినిమాను డ్యూయల్ రోల్ రూపొందించడం కూడా బోయపాటి కి మైనస్ అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బోయపాటికి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అధికారికంగా ప్రకటించలేదు. అలాగే వీరిద్దరు కాంబో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.