బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కు ఈడి నోటీసులు..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ ఈడీ నోటీసులను పంపింది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నోటీసులను ఇవ్వడం జరిగింది. ఈనెల 6న విచారణకు హాజరు అవ్వాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న మహదేవ్ క్రికెట్ రణ్‌బీర్‌ కపూర్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఈ కేసులు వారం క్రితం వైజాగ్ లో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక ఈ కేసులో ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పంద లావాదేవీల పై రణ్‌బీర్ కపూర్ కు ఈడి నోటీసులు అందించారు. రణ్‌బీర్‌ కపూర్ ఎల్లుండి విచారణకు హాజరవుతారా.. లేదా.. అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. ఈ కేసులో రెండు బీర్ కపూర్ తో పాటు బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ కు కూడా ఈడి నోటీసులు అందాయి. అలాగే మరికొందరు నటీనటులు, గాయకుల పేర్లు కూడా తెరమీదకు రావచ్చని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత మోసపోతున్నారు. భారీ ఎత్తున డబ్బులు దోచేస్తున్న బెట్టింగ్ యాప్స్ కారణంగా కొంతమంది అప్పులు చేసి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి బెట్టింగ్ యాప్ కు ప్రచారకర్తగా రణ్‌బీర్ కపూర్ వ్య‌వ‌హ‌రించిన కారణంగా నోటీసులు అందుకున్నాడు. అయితే ఈ కేస్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.