ఆ స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించిన ప్రియ‌మ‌ణి.. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుందా?

సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి పరిచయాలు అవసరం లేదు. కేరళలో పుట్టిన ఈ అందాల కుట్టి 2003లో ఓ తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌క్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా సాగిపోతున్న స‌మ‌యంలోనే వ్యాపారవేత్త ముస్తఫా రాజ్‌తో ప్రియ‌మ‌ణి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రియ‌మ‌ణి.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వయసుకు తగ్గా పాత్రలు పోషిస్తూ.. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే.. ప్రియ‌మ‌ణి గ‌తంలో ఓ స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్. షారుఖ్‌ ఖాన్ అంటే ఆమెకు చాలా అభిమానం అట‌. చిన్నతనంలో ప్రియ‌మ‌ణి షారుఖ్ ను పెళ్లి చేసుకోవాలని కలలు కూడా కన్నదట. అయితే ఆ క‌ల నెరవేరకపోయినా.. షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవ‌కాశాలు మాత్రం ద‌క్కించుకుంటోంది. ఆల్రెడీ షారుఖ్ హీరోగా తెర‌కెక్కిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం లో ప్రియ‌మ‌ణి ఐటెం సాంగ్ చేసింది. రీసెంట్ గా విడుద‌లైన ఆయ‌న సినిమా `జ‌వాన్‌`లో ప్రియ‌మ‌ణి ఓ కీల‌క పాత్ర‌ను పోషించి అల‌రించింది.